ఎన్నికల్లో గెలిచిన జేవియర్ బెసెర, కాలిఫోర్నియా తదుపరి గవర్నర్ గా బాధ్యతలు
డెమొక్రాటిక్ అభ్యర్థి జేవియర్ బెసెర, రిపబ్లికన్ అభ్యర్థి స్టీవ్ హిల్టన్‌పై విజయం సాధించారు. దీంతో కాలిఫోర్నియా తదుపరి గవర్నర్ గా బెసెర బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో మొదటి లాటినో హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కార్యదర్శిగా పనిచేసిన బెసెర, 54% ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 65% ఓట్లతో హిల్టన్ (34%) పై స్పష్టమైన ఆధిక్యం సాధించారు.
కాలిఫోర్నియా గవర్నర్ పోటీ ప్రారంభం నుంచే కొంత క్లిష్టంగా వుంది. మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, సేనెటర్ అలెక్స్ పడిల్లా మరియు అటార్నీ జనరల్ రాబ్ బొంటాతో సహా రాష్ట్రంలోని కొందరు ప్రముఖ డెమొక్రాట్ నాయకులు ఈ రేసులో పోటీ చేయడానికి కూడా నిరాకరించారు. దీనితో ఎక్కువమంది అంతగా పేరులేని అభ్యర్థులు తమ స్థానం కోసం పోటీ పడే పరిస్థితి ఏర్పడింది.
బెసెర్రా తన ఎన్నికల ప్రచారంలో ఇంధన ధరలను తగ్గించడం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దిశగా పనిచేయడం అనే అంశాలపై విస్తృత ప్రచారం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ను టార్గెట్ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో అటార్నీ జనరల్‌గా ఉన్నప్పుడు, తాను అధ్యక్షుడిపై 100 సార్లకు పైగా దావా వేశానని ఆయన గుర్తుచేసుకున్నారు.జూన్ ప్రాథమిక ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన బెసెర్రా, హిల్టన్‌పై సులభంగా విజయం సాధించారు. కాలిఫోర్నియాలో చలనచిత్ర మరియు టీవీ పన్ను ప్రోత్సాహకాలను విస్తరించే అంశంతో సహా, ఆయన చాలా తక్కువ విషయాలపైనే స్పష్టమైన హామీలు ఇచ్చారు.







