కృష్ణంరాజుకు అరుదైన గౌరవం
ప్రముఖ నటుడు కృష్ణంరాజు యువకళావాహిని జీవన సాఫల్య పురస్కారం అందుకోబోతున్నారు. ఈ నెల 9న హైదరాబాద్లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయనకు అవార్డు అందించనున్నట్టు సంస్థ అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే కార్యక్రమంలో సినీ ప్రముఖులు మణిశర్మ, రామజోగయ్య శాస్త్రి, బుర్రా సాయిమాధవ్, సాయిచంద్లను ఈ సంస్థ సన్మానించనుంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, జస్టిస్ జి.భవాని ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.








