ప్రభాస్ కంటే అమెకే ఎక్కువ పేరు
రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి-2 రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అత్యంత కీలకమైన శివగామి పాత్రను పోషించేందుకు తొలుత అతిలోకసుందరి శ్రీదేవిని దర్శక నిర్మాతలు స్పందించారు. కానీ కొన్ని కారణాల రీత్యా వీరి ఆఫర్ను శ్రీదేవి తిరస్కరించింది. దీనిపై ప్రముఖ సినీ దర్శకుడు, శ్రీదేవి వీరాభిమాని రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సినిమాలో శ్రీదేవి నటించకపోవడం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందని వర్మ తెలిపారు. ఆమె నటించి ఉంటే ఆమె కెరియర్లోనే అత్యద్భుతమైన చిత్రంగా ఇది మిగిలిపోయేదని చెప్పారు. ప్రభాస్ కంటే కూడా శ్రీదేవికి ఎక్కువ పేరు వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు.













