King100: నాగ్100 మెయిన్ ప్లాట్ ఏంటంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున(akkineni nagarjuna) తన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ రా. కార్తిక్(Ra. karthik) రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా అప్డేట్ ప్రకారం, షూటింగ్ లో దాదాపు 40% భాగం పూర్తయ్యింది. అయితే టైటిల్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే మేకర్స్ అధికారికంగా పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఈ సినిమా కథలో భావోద్వేగాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తండ్రీ కూతురు అనుబంధాన్ని ప్రధానంగా చూపించనున్నారట. అదే సమయంలో, సాధారణ స్థాయి నుండి ఆర్థికంగా ఎదిగి విజయశిఖరాలను అధిరోహించే వ్యక్తి జీవిత ప్రయాణాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మిళితం చేస్తూ చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇక ఈ సినిమాలో సాంకేతికంగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. నాగార్జున పాత్రను వివిధ వయసుల్లో చూపించేందుకు డీ- ఏజింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీంతో ఆయన యువకుడి నుండి వృద్ధుడి వరకు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో టబు(Tabu), సుస్మితా భట్(Susmitha bhatt), విజయేంద్ర(Vijayendra) కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఇవి కూడా చదవండి








