రొమాన్స్‌కు సిద్ధమని చెబుతున్న మాజీ విశ్వసుందరి
ఒకప్పడు వెండితెరపై మెరిసి తర్వాత కుటుంబానికే పరిమితమైన అలనాటి హీరోయిన్లు ఈ మధ్య రీ ఎంట్రీ ఇస్తున్నారు. వారి వయసుకు తగ్గ పాత్రలో మెరస్తున్నారు. అయితే మాజీ విశ్వసుందరీ సుస్మితాసేన్ మాత్రం తన రీఎంట్రీ ఇవ్వబోయే చిత్రాల్లో రొమాన్స్ చేయాలని ఉందంటోంది. నేను కామెడీ చిత్రాల్లో, హారర్ చిత్రాల్లో నటించాను. డ్రామా, ఎమోషన్స్ ఉన్న చిత్రాల్లోనూ నేనేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు నాకు రొమాంటిక్ సినిమాలో అద్భుతమైన రొమాన్స్‌ను పండిచాలని ఉంది. అలాగే పరిణతి చెందిన మహిళా పాత్రలోనూ నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ఈ విషయం విన్న తర్వాత దర్శక నిర్మాతలు సుస్మితాకి రొమాంటిక్ కథలే చెబుతారేమో.








