విజయనిర్మలకు డాక్టరేట్ ప్రదానం
44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన విజయనిర్మలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చే విధంగా కృషి చేస్తానమి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విజయనిర్మలకు రాయల్ అకాడమి ఆఫ్ పీస్ స్వచ్చంద సంస్థ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ అవార్డును నానక్‌రాంగూడలోని అమె నివాసంలో సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే గాంధీ సమక్షంలో ఆమెకు అందజేసి, కృష్ణ, విజయనిర్మల దంపతులను సన్నానించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి బ్రదర్స్, నరేశ్, నవీన్, శివాజీరాజా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.













