ఆ ముగ్గురూ నాకు మరదళ్లు : విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్‌రెడ్డి పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శలు గుప్పించడం వైరలైంది. మొన్న ఓ బస్సుపై అర్జున్‌రెడ్డి పోస్టర్ కనిపించడంతో వీహెచ్ దానిని చించేశారు. దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ, వీహెచ్ కామెంట్లు గుప్పించారు. మరోపక్క ఈ సినిమా చాలా బాగుందంటూ కేటీఆర్, ఇతర సెలబ్రిటీలు విజయన్ ప్రశంసించారు. దాంతో కేటీఆర్ విజయ్‌కి బంధువవుతాడంటూ వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై స్పందిస్తూ విజయ్ ఫేస్బుక్లో ఓ ఫోస్ట్ పెట్టారు. డియర్ తాతాయ్య అర్జున్ రెడ్డి బాగుందన్న కేటీఆర్ నాకు బంధువైనపప్పుడు, ఎస్ఎస్ రాజమౌళి నాకు తండ్రి అవుతారు. రానా దగ్గుబాటి, నాని వరుణ్‌తేజ్, శర్వానంద్‌లు సోదరులవుతారు. నాకు అక్కచెల్లెళ్లు లేరు కాబట్టి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలీదు. అందుకే సమంత, అను ఇమ్మాన్యుయేల్, మెహరీన్ నా మరదళ్లు. ఐదు రోజుల్లో నా సినిమాను సూపర్‌హిట్ చేసిన విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ నాకు కవలలు. కానీ వర్మ మాత్రం మన ఇద్దరిలో ఎవరికి తండ్రో క్లారిటీ లేదు. తాతాయ్య చిల్ అని విజయ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.













