ఆ సినిమా వెంటనే నిలిపివేయాలి
అర్జున్ రెడ్డి సినిమాను వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమా చూసి యువత చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలో డ్రగ్స్ విపరీతంగా తీసుకుంటారని, ర్యాగింగ్ చేసి పెళ్లికాకముందే ప్రెగ్నెంట్ చేశారని విమర్శించారు. అర్జున్ రెడ్డి రెడ్డి సినిమా చూసి, మంత్రి కేటీఆర్ యువతకు ఏం చెప్పదలుచుకున్నారని వీహెచ్ ప్రశ్నించారు. ఆ సినిమాపై సెన్సార్ బోర్డు, సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అర్జున్ రెడ్డి సినిమాపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కోరారు.













