డ్రాగన్‌లో రెండు ప్రపంచాలు.. అసలు సర్ప్రైజ్ అదేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్(Prasanth Neel) కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్(Dragon)పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ యాక్షన్ కథగా రూపొందుతున్న ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి చిన్న సమాచారం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమాలంటే డార్క్ విజువల్స్, బ్లాక్ అండ్ గ్రే షేడ్స్ గుర్తొస్తాయి. అయితే డ్రాగన్ విషయంలో మాత్రం ఈ టేకింగ్‌కు భిన్నమైన ప్రయోగం కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను పూర్తి కలర్‌ఫుల్ విజువల్స్‌తో చూపించనున్నారట. దీంతో కథలో ప్రెజెంట్, ఫ్లాష్‌బ్యాక్ రెండు విభిన్న ప్రపంచాలుగా కనిపించే అవకాశం ఉంది.
ఒకవైపు నీల్ మార్క్ డార్క్ యాక్షన్ టోన్, మరోవైపు ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే కలర్‌ఫుల్ వరల్డ్.. ఈ కాంట్రాస్ట్ సినిమాకు ప్రత్యేకమైన విజువల్ ఐడెంటిటీని తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ కు సంబంధించిన గతాన్ని ఎంత వైవిధ్యంగా ప్రజెంట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు నీల్ సినిమాల్లో కనిపించిన విజువల్ స్టైల్‌కు భిన్నంగా డ్రాగన్‌ను ప్రెజెంట్ చేయాలనే ఆలోచన ఇందులో కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది.
ఇక డ్రాగన్ కొత్త షెడ్యూల్‌పై కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల మూడో వారంలో షూటింగ్ తిరిగి ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారట. షూటింగ్ మొదలైతే వరుసగా సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్, స్టిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో చాలా కాలంగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్‌కు త్వరలోనే వరుస ట్రీట్స్ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.








