దసరా బరిలో శ్రీవిష్ణుకు ఊహించని అడ్వాంటేజ్
యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటిస్తున్న కామ్రేడ్ కళ్యాణ్(comrade Kalyan) పై ఇప్పుడు అంచనాల కంటే థియేట్రికల్ లెక్కలు ఎక్కువగా ఆసక్తిని పెంచుతున్నాయి. కొంతకాలంగా సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయిన శ్రీ విష్ణు.. ఈసారి కామెడీ ఎంటర్టైనర్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. జానకిరామ్ మారెళ్ల(Janakiram marella) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్‌కు రెడీ అయింది. మహిమా నంబియార్(Mahima nambiyar) హీరోయిన్ గా నటించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ(Skandha vahana motion pictures LLP), కోన ఫిల్మ్ కార్పొరేషన్(Kona Film corporation) సంయుక్తంగా నిర్మించాయి.
నిజానికి అదే తేదీకి వెంకటేష్(venktaesh), త్రివిక్రమ్(trivikram) కాంబినేషన్లోని ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) కూడా రావాల్సి ఉండటంతో కామ్రేడ్ కళ్యాణ్ కు గట్టి పోటీ తప్పదనే అభిప్రాయం ఏర్పడింది. అక్టోబర్2 నుంచి పోస్ట్ పోన్ అయిన ఆదర్శ కుటుంబంను అక్టోబర్ 9న రిలీజ్ చేయాలని డిసైడ్ అవడంతో రెండు సినిమాల మధ్య క్లాష్ ఫిక్స్ అయింది. అయితే ఇప్పుడు ఆదర్శ కుటుంబం మరోసారి వాయిదా పడటంతో శ్రీ విష్ణు సినిమాకు పోటీ బాగా తగ్గిపోయింది.
ముఖ్యంగా అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు ప్రారంభం కావడం కామ్రేడ్ కళ్యాణ్ కు కలిసొచ్చే అంశంగా మారింది. పెద్ద పోటీ లేకుండా ఎక్కువ థియేటర్లలో నిలదొక్కుకునే అవకాశం రావడంతో ఓపెనింగ్స్‌తో పాటు లాంగ్ రన్ పైనా ఆశలు పెరిగాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ దసరా సీజన్ శ్రీ విష్ణుకు మంచి కమ్‌బ్యాక్‌గా మారే అవకాశముంది.








