NTRNeel: ఎన్టీఆర్ నీల్ మూవీపై టోవినో షాకింగ్ కామెంట్స్
మలయాళ స్టార్ హీరో టోవినో థామస్(Tovino thomas), కయాదు లోహర్(kayadhu lohar) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియడ్ డ్రామా పళ్లిచట్టంబి(Palli chattambi) రిలీజ్ కు రెడీ అవుతోంది. డిజో జోస్ ఆంటోనీ(Dejo jos anthony) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేరళ వలస రైతు సంఘాల నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ, ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ ను ప్రారంభించగా, టోవినో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్లో చర్చనీయాంశంగా మారాయి.
తెలుగు సినిమా ఎంట్రీపై స్పందించిన టోవినో థామస్, తనకు టాలీవుడ్లో నటించే ఆసక్తి ఉన్నప్పటికీ, ఇక్కడి వర్కింగ్ స్టైల్ మలయాళ ఇండస్ట్రీతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. మలయాళంలో ఒకే షెడ్యూల్లో సినిమా పూర్తి చేసే విధానం ఉండగా, తెలుగులో మాత్రం మల్టిపుల్ షెడ్యూల్స్ కారణంగా ప్రాజెక్టులు ఎక్కువ కాలం కొనసాగుతాయన్నారు. ఒక తెలుగు సినిమా కోసం ఏడాది సమయం కేటాయించాల్సి వస్తే, అదే సమయంలో తాను నాలుగు నుంచి ఐదు మలయాళ సినిమాలు పూర్తి చేయగలనని వివరించారు.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్(NTR)- ప్రశాంత్ నీల్(prasanth neel) కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌లో తాను భాగం కాదని టోవినో స్పష్టం చేశారు. ఒకేసారి ఒక్క సినిమాకే డేట్స్ కేటాయించడం తన వర్క్ స్టైల్ అని, సమాంతరంగా అనేక ప్రాజెక్టుల్లో నటించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించగా, టాలీవుడ్లో స్టార్ల పని విధానాలపై కొత్త చర్చకు దారితీశాయి.
ఇవి కూడా చదవండి








