Prasanth Neel: డ్రాగన్ ను కూడా అలానే ప్లాన్ చేస్తున్న నీల్
టాలీవుడ్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్(prasanth neel), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. యాక్షన్ మరియు భారీ మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన గత సినిమా సలార్(Salaar) విషయంలో అనుసరించిన స్ట్రాటజీని ఈ ప్రాజెక్ట్కూ ఉపయోగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అప్పట్లో ప్రభాస్(Prabhas)తో తెరకెక్కిన ఆ సినిమాలో మొదటి భాగంతో పాటు రెండో భాగానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను కూడా ముందుగానే షూట్ చేశారు. అదే తరహాలో ఎన్టీఆర్ సినిమా కోసం కూడా పార్ట్2కు సంబంధించిన కొన్ని సీన్లు ఇప్పుడే షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు రవి బస్రూర్(ravi basrur) సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) మరియు యువసుధ ఆర్ట్స్(Yuvasudha Arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కథ, యాక్షన్ ట్రీట్మెంట్ విషయంలో ప్రశాంత్ నీల్ ప్రత్యేక శైలిని ఈ సినిమాలో కూడా చూడొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి








