ప్రియాంక చోప్రా ఐఫాకి హాజరుకాకపోవడానికి కారణం!
బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ తన క్రేజ్ అమాంతం పెంచేసుకున్న అందాల నటి ప్రియాంక చోప్రా. బేవాచ్ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు హాలీవుడ్ సీరియల్ క్యాంటికో మూడో సీజన్ లో నటిస్తుంది. ఇక ఎ కిడ్ లైక్ జేక్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్ అనే ఆంగ్ల చిత్రాలలోను ప్రియాంక ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల న్యూయార్క్ లో జరిగిన 18వ ఎడిషన్ ఐఫా అవార్డుల కార్యక్రమానికి గైర్హజరు అయింది. ప్రియాంక లేని లోటు అక్కడ ఖచ్చితంగా కనిపించిందని కొందరు చెప్పుకొచ్చారు. అయితే ప్రియాంక ఐఫా అవార్డు కార్యక్రమానికి వెళ్ళకపోవడానికి కారణం భారీ రెమ్యొనరేషన్ డిమాండ్ చేయడమేనట. ఐఫా ఉత్సవానికి తాను హోస్ట్ గా ఉంటానని, అందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించాలని ప్రియాంక డిమాండ్ చేసిందట. ఈ ఆఫర్ ని నిర్వహకులు రిజెక్ట్ చేశారు. దాంతో ఈ అమ్మడు ముంబై వచ్చి తన ఫ్యామిలీ తో సరదాగా గడిపిందని బాలీవుడ్ టాక్.













