టాలీవుడ్లో డేట్ గేమ్.. వెనక్కి తగ్గనున్న పాన్ ఇండియా సినిమాలు?
2027లో టాలీవుడ్ బాక్సాఫీస్‌పై భారీ సినిమాల హవా కనిపించనుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న అగ్ర హీరోల సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పై అనిశ్చితి నెలకొంది. ప్రభాస్(prabhas) నటిస్తున్న ఫౌజీ(Fauzi)ని మార్చి 2027లో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మరోవైపు రాజమౌళి(rajamouli) తెరకెక్కిస్తున్న వారణాసి(Varanasi) షూటింగ్లో కీలక భాగం పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పై దృష్టి సారించారు. ఏప్రిల్ 7, 2027 రిలీజ్ టార్గెట్‌గా పనిచేస్తున్నప్పటికీ, వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా ఆగస్టుకు వాయిదా పడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఎన్టీఆర్(NTR) నటిస్తున్న డ్రాగన్(Dragon) సినిమా రిలీజ్ విషయంలోనూ కొత్త డిస్కషన్ మొదలైంది. తొలుత జూన్ 2025కు అనుకున్న ఈ సినిమా జూన్ 2026కు వాయిదా పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్(Allu arjun), అట్లీ(Atlee) కాంబినేషన్లో రూపొందుతున్న రాకా(Raaka) సినిమాను క్రిస్మస్ 2027కు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. అయితే షూటింగ్ పూర్తయ్యాకే రిలీజ్ పై క్లారిటీ రానుంది. అవసరమైతే 2028కు కూడా వెళ్లే అవకాశముంది.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్(Spirit) అక్టోబర్ 29, 2027న రిలీజ్ కావాల్సి ఉంది. ఫౌజీ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ అందుబాటును బట్టి ఈ సినిమా షెడ్యూల్ మారే అవకాశం ఉంది. మరోవైపు చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(Viswambhara) కూడా 2027లో రిలీజయ్యేలా మేకర్స్ సరైన డేట్ కోసం అన్వేషిస్తున్నారు. మొత్తంగా 2027లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాల మధ్య పోటీ ఇంట్రెస్టింగ్ గా మారనుంది. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ లో లాస్ట్ మినిట్ లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది చూడాలి.







