అలియాస్ రుక్మిణి రిలీజ్ కు ముందే నాని బ్లాక్‌బస్టర్ ధీమా!
నితిన్(nithin) హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా అలియాస్ రుక్మిణి(Alias rukmini)పై టాలీవుడ్లో ఆసక్తి పెరుగుతోంది. మురళీకాంత్ దేవసోత్(Muralikanth devasoth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆఫియా సయ్యద్(Aafia syed) హీరోయిన్ గా నటిస్తుంది. దీప్తి గంట(Deepthi Ganta) నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మేకర్స్ నిర్వహించిన జామ్ పార్టీకి నేచురల్ స్టార్ నాని(Nani) చీఫ్ గెస్టు గా హాజరై, ఈ ఈవెంట్ ను రిలీజ్ కు ముందే సక్సెస్మీట్గా అభివర్ణించారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. సినిమాపై తమకు ఉన్న నమ్మకమే ఈ ఈవెంట్ కు కారణమని తెలిపారు. నితిన్‌తో తన బాండింగ్ ను గుర్తుచేసుకుంటూ, గతంలో ఆయన సినిమాకు క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేసిన విషయాన్ని వెల్లడించారు. అలియాస్ రుక్మిణి నితిన్ కెరీర్లో సక్సెస్ఫుల్ కంబ్యాక్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో కృష్ణ క్యారెక్టర్ లో నితిన్ అద్భుతంగా నటించారని, సినిమా ఆద్యంతం ఆ పాత్రలో జీవించారని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి
అలాగే ఆఫియా సయ్యద్‌ను మంచి టాలెంట్ ఉన్న నటిగా అభినందించారు. కథలోని సహజత్వం, ఎమోషన్స్ ఆడియన్స్ కు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయని నాని పేర్కొన్నారు. మరోవైపు నితిన్ సైతం ఈ సినిమా తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విజయ్ బుల్గానిన్(Vijay bulganin) అందించిన సాంగ్స్ ఇప్పటికే మంచి ఆదరణ పొందడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.







