టీజర్‌తో మొదలుకానున్న ఫ్యామిలీ ప్యాక్ ప్రమోషన్లు
సామజవరగమన(samajavaragamana) సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీ విష్ణు(Sree vishnu), ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ అబ్బరాజు(ram abbaraju) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా నవంబర్ 23న సినిమా టీజర్‌ను రిలీజ్ చేయాలని డిసైడైంది.
ఇవి కూడా చదవండి
సాధారణ అప్డేట్స్కు భిన్నంగా టీజర్ ద్వారా సినిమా నేపథ్యం, పాత్రల స్వభావం, ఎంటర్టైన్మెంట్ అంశాలపై ఆడియన్స్ కు ఓ అవగాహన కల్పించే అవకాశముంది. ముఖ్యంగా శ్రీ విష్ణు నుంచి ఎలాంటి కొత్త తరహా కామెడీని చూడబోతున్నామనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి మధోల్కర్(Sakshi madholkar) హీరోయిన్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్(Vennela kishore), సుదర్శన్(Sudarsan) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టీజర్ రిలీజ్ తో మొదలయ్యే ప్రమోషన్స్ సినిమా చుట్టూ మరింత ఆసక్తిని పెంచేలా ఉండనున్నాయి. 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు భాను భోగవరపు(Bhanu bhogavarapu), నందు సవరిగాన(Nandu savarigana) కథ, మాటలు అందిస్తున్నారు. మరి టీజర్‌తో మేకర్స్ ఎలాంటి కంటెంట్‌ను పరిచయం చేస్తారో చూడాలి.







