డైరెక్టర్స్ కట్‌తో మరోసారి థియేటర్లలోకి జైలర్2
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) నటించిన జైలర్2(jailer2) బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్(Nelson dileepkumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే సినిమా రన్ టైమ్, కథనానికి సంబంధించిన కారణాలతో కొన్ని కీలక సీన్స్, స్పెషల్ సాంగ్స్ కు సంబంధించిన ఎపిసోడ్స్‌ను చివరి నిమిషంలో తొలగించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ సన్నివేశాలన్నింటినీ కలిపి ప్రత్యేకంగా డైరెక్టర్స్ కట్ ను రెడీ చేయాలని డైరెక్టర్ నెల్సన్ భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది.
ఈ కొత్త వెర్షన్‌ను డిసెంబర్ 12న ఎక్స్ట్రా సీన్స్ తో భారీ స్థాయిలో మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే రిలీజైన సినిమాను ఇంత తక్కువ గ్యాప్ లో మళ్లీ థియేటర్లలోకి తీసుకురావడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటివరకు ఈ రీరిలీజ్‌పై నిర్మాతల నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. ఒకవేళ కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేయాలనుకుంటే సెన్సార్ ప్రక్రియను కూడా మరోసారి పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, థియేట్రికల్ రీరిలీజ్ కంటే ఎక్స్ట్రా సీన్స్ తో కూడిన డైరెక్టర్స్ కట్‌ను ఓటీటీలో రిలీజ్ చేయడం మంచి డెసిషన్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ స్పెషల్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తే ఇప్పటికే సినిమాను చూసిన ఆడియన్స్ సైతం మరోసారి చూసే అవకాశం ఉంటుంది. మరి నెల్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? జైలర్2 మరోసారి థియేటర్లలో సందడి చేస్తుందా లేక ఓటీటీలో కొత్త వెర్షన్‌గా వస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ సినిమాను సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మించిన విషయం తెలిసిందే.







