సమంత దంపతులకు రామ్ చరణ్ స్పెషల్ విషెస్
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) లైఫ్ లో కొత్త చాప్టర్ ప్రారంభమైంది. ఆమె, రాజ్(Raj) దంపతులకు మగబిడ్డ జన్మించడంతో ఫ్యాన్స్, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటి తల్లిగా ప్రమోషన్ పొందిన వార్తతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ జంటకు అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) కూడా సమంత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. తమ జీవితాల్లోకి అడుగుపెట్టిన చిన్నారి రాకతో సమంత, రాజ్‌లకు లభించిన ఆనందం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబానికి ప్రేమ, సంతోషాలతో నిండిన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తన పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా, రామ్ చరణ్, సమంత గతంలో సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ సాధించడంతో పాటు వీరిద్దరి కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచింది. అప్పటి నుంచి కొనసాగుతున్న స్నేహాన్ని చరణ్ తాజా అభినందన పోస్ట్ మరోసారి గుర్తు చేసింది.







