హనుమాన్2 అనౌన్స్మెంట్ తో కొత్త వివాదం
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth varma) తెరకెక్కించిన హనుమాన్(Hanu man) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకోవడంతో దానికి సీక్వెల్ గా జై హనుమాన్(Jai hanuman) ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. అయితే నిర్మాతలతో ఏర్పడిన విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో కొంతకాలం అనిశ్చితి నెలకొంది. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) రంగంలోకి దిగి, హనుమాన్ నిర్మాతలతో ప్రశాంత్ వర్మకు సంబంధించిన ఆర్థిక వివాదాలను పరిష్కరించినట్లు ప్రచారం జరిగింది. రిషబ్ శెట్టి(Rishab shetty) ప్రధాన పాత్రలో జై హనుమాన్ ను రూపొందించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. స్టోరీ రైటర్ గా ప్రశాంత్ వర్మకు హనుమాన్ పై హక్కులు ఉన్నాయన్న వాదన కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారింది.
ఇదిలా ఉంటే, తాజాగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ హనుమాన్2(Hanuman2)ను అనౌన్స్ చేయడంతో మరోసారి ఈ ప్రాజెక్టుల చుట్టూ డిస్కషన్ మొదలైంది. గతంలో మైత్రీ సంస్థ, ప్రైమ్‌షో(Prime show) మధ్య జరిగిన డిస్కషన్స్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జై హనుమాన్ కు ఎదురైన అడ్డంకులను తొలగించేందుకు మైత్రీ భారీ మొత్తంలో ఖర్చు చేసిన నేపథ్యంలో, ఇదే కథా నేపథ్యంతో మరో సినిమా అనౌన్స్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామాల నేపథ్యంలో రెండు సినిమాల నిర్మాణం, రిలీజ్ ప్లాన్స్ పై ఆసక్తి నెలకొంది. అవసరమైతే మైత్రీ సంస్థ లీగల్ యాక్షన్స్ కు వెళ్లే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రైమ్‌షో కూడా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే హనుమాన్ ను అనౌన్స్ చేసి ఉంటుందని మరో వాదన ఉంది. ప్రస్తుతానికి ఈ వివాదంపై అఫీషియల్ క్లారిటీ లేకపోవడంతో, రాబోయే రోజుల్లో నిర్మాతలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో వేచి చూడాలి.







