రసవత్తరంగా జరిగిన తెలంగాణ స్టేట్ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు!
ధ్యక్షుడిగా కె.మురళీమోహన్, ప్రధాన కార్యదర్శిగా సునీల్ నారంగ్ విజయం!
తెలంగాణ స్టేట్ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు శనివారం రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కె.మురళీమోహన్రావు, ఉపాధ్యక్షులుగా వి.ఎల్.మల్లికార్జున్ గౌడ్, వీఎల్ శ్రీధర్, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద రాజ్ తాడ్లలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శితో పాటు, కోశాధికారి, ఇతర కార్యవర్గసభ్యుల ఎంపికకు జరిగిన ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. ప్రధాన కార్శదర్శిగా సునీల్ నారంగ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించగా, కోశాధికారిగా ఎ.జె.ఇన్నారెడ్డి గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా జె.చంద్రశేఖర్‌రావు, వి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసరావు (వాసు), ఎమ్.మెహన్కుమార్, దిలీప్ కుమార్ టాండన్, ఎ.సుధాకర్ రెడ్డి, జి.శ్రీనివాస్, పి.సుబ్రమణ్యం, జీవీవీ ప్రసాద్‌రావు, పి.అశోక్ రావులు ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. రెండు సంవత్సరాల పాటు ఈ నూతన కమిటీ కొనసాగుతుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపును చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటు పడతామని, చిన్న సినిమాలకు కావాల్సిన తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తెలియజేశారు.













