కాటమరాయుడికి కేటీఆర్ అభినందనలు
పవన్‌కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం బావుందంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌తో కలిసి కేటీఆర్ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్బంగా పవన్‌తో కలిసి తాను దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోపాటు సినిమాలో చేనేత వస్త్రాలకు మంచి ప్రమోషన్ చేశారని కేటీఆర్ ప్రశంసించారు. చేనేత కార్మికులకు ఉచిత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని గతంలో మాటిచ్చిన పవన్ ఈ చిత్రంలో తన పాత్రకు తగ్గట్టుగా చేనేత వస్త్రాలను ధరించడం విశేషం.













