తెలంగాణలో బహుబలి 5 షోలు
బాహుబలి చిత్రానికి రోజుకు ఐదు ప్రదర్శనలకు అనుమత్విడంతో పాటు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బాహుబలి చిత్ర నిర్మాత దేవినేని ప్రసాద్ సచివాలయంలో మంత్రిని కలిశారు. సినిమా విడుదల నేపథ్యంలో ప్రత్యేక ప్రదర్శనకు ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిత్రాన్ని రోజుకు ఐదు ప్రదర్శనలు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై మంత్రి తలసాని స్పందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన బాహుబలికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. నిర్మాతలు కోరిన మినహాయింపులు, అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి సృష్టం చేసినట్లు తెలిపారు. సినిమా థియేటర్లలో ఆహార పదార్ధాల ధరలను నియంత్రించడంతో పాటు ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.













