అఖిల్ కి తల్లిగా…. టాప్ హీరోయిన్?
టాలీవుడ్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతున్నది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా తెలుగు సినిమాలను ఏలిన టబు, అఖిల్ అక్కినేని తర్వాతి సినిమాలో అతనికి తల్లిగా కనిపించబోతుందన్నది ఆ వార్త. ఈ సినిమాను నాగార్జునే నిర్మిస్తున్నట్లు సమాచారం. టబు ఒకప్పుడు నాగార్జున సరసన హిట్ సినిమాల్లో నటించడమే కాదు, అతనితో డేటింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ నాగ్‌తో టబుకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాగ్ ఇంట్లోనే బస చేస్తానని గతంలో టబునే చెప్పింది. అలాంటి టబు ఇప్పుడు అఖిల్‌కు తల్లి పాత్ర పోషించనుందన్నది కచ్చితంగా ఆసక్తికర విషయమే. క్యారెక్టర్ నచ్చినందుకే ఆమె ఈ రోల్ అంగీకరించినట్లు సమాచారం.








