అతడి వల్లే నా పెళ్లి కాలేదు!
కూలీ నెం.1 చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆ తరువాత పలు చిత్రాలతో అగ్రస్థాయికి ఎదిగి బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా హవా సృష్టించిన టబు, తన మనసులో మాట బయటపెట్టింది. ఇప్పటివరకూ పెళ్లిచేసుకోకపోవడానికి కారణం ఏమిటి? అని అడిగితే ఓ హీరో అని చెప్పింది. అతనెవరో కాదు బాలీవుడ్ నటుడు, కాజోల్ భర్త అజయ్ దేవ్గన్. ఇదేంటి చెప్మా అనుకుంటున్నారా? అదేంకాదు అజయ్‌దేవ్‌గన్‌తో చిన్ననాటి నుంచి ఆమెకు పరిచయం ఉన్నదట. దాదాపుగా 25 సంవత్సరాల నుండి అతను తనకు తెలుసని చెబుతోంది టబు. ఇంకా ఆమె మాటల్లోనే చెప్పాలంటే అజయ్ మా కజిన్ సమీర్ ఇంటిపక్కనే ఉండేవాడు. అప్పట్లో నేను ఎక్కడికి వెళ్లినా నన్ను ఫాలో అవుతూ వచ్చేవాడు. నన్ను నిరంతరం నీడలా వెంటాడేవాడు. వేరే అబ్బాయిలు మాట్లాడినా తను తట్టుకోలేకపోయేవాడు. ఒక్కో సమయంలో వారితో ఫైట్స్ కూడా చేసే వాడు. అజయ్ దేవ్గన్ ప్రేమను గమనించి నేను ఇప్పటివరకూ పెళ్లిచేసుకోలేదు. తాను ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తాడో లేదా, చూద్దాం అని అంటోంది. ఇప్పుడున్న హీరోల్లో అజయ్‌దేవ్‌గన్ అంటే తనకిష్టమని, తమ బంధం వైవిధ్యంగా సాగే స్పెషల్ ఇష్యూ అని, తాను చిన్న పిల్లలా ప్రవర్తించినా, పరిపూర్ణమైన వ్యక్తిగా నన్ను చూసుకుంటాడన్న నమ్మకం ఉందని చెబుతోంది. టబు చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో ఎంత దుమారం రేపుతాయో చూడాల్సిందే.













