తెలుగు రాష్ట్రాల్లో సూర్య సినిమాకు స్క్రీన్ల కష్టాలు!
తమిళ స్టార్ హీరో సూర్య(Suriya)కు ఈ ఏడాది రెండు సక్సెస్‌లు దక్కాయి. కరుప్పు(Karuppu), విశ్వనాథ్ అండ్ సన్స్(Viswanath & Sons) సినిమాలతో మంచి ఫలితాలను అందుకున్న ఆయన ఇప్పుడు దీపావళి బరిలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీతూ మాధవన్(Jeethu madhavan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీన్(Scene) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నజ్రియా నజీమ్(Nazriya nazim), నస్లెన్(naslen) కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్వీఆర్(NVR) సినిమా సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.
అయితే తెలుగులో సీన్ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించడం లేదు. దీపావళి బరిలో ఇప్పటికే భారీ అంచనాలతో రామాయణ(Ramayana) తెలుగు, హిందీ వెర్షన్లు బరిలో ఉండటంతో మెయిన్ మల్టీప్లెక్స్ స్క్రీన్లన్నీ వాటికే కేటాయించారు. మరోవైపు వెంకటేష్(venkatesh) నటించిన ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) కూడా ఈ పండుగ సీజన్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లను దక్కించుకోనుంది. దీంతో సూర్య సినిమాకు స్క్రీన్ల పరంగా గట్టి పోటీ ఎదురవుతోంది.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై పెద్దగా బజ్ తీసుకురాలేకపోయింది. ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, మౌత్ టాక్ ఆధారంగానే తదుపరి రోజుల్లో థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సీన్‌కు బాక్సాఫీస్ ప్రయాణం అంత సులభంగా కనిపించడం లేదు.







