గరుడవేగలో సన్నీలియోన్!
సీనియర్ నటుడు డా.రాజశేఖర్ కొంత విరామం తర్వాత పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం పి.ఎస్.వి.గరుడవేగ. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ చిత్రం కోసం శృంగార తార సన్నిలియోన్ ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ ముంభై ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో సన్నిలియోన్‌పై పాటని చిత్రీకరిస్తారు. గందిబాత్ రాం చాహే లీల చాపీ వంటి బాలీవుడ్ సూపర్‌హిట్ పాటలకు కొరియోగ్రఫీ అందించిన విష్ణుదేవా నేతృత్వంలో చిత్రీకరణ జరుగుతుంది.













