లాస్ ఏంజిల్స్‌లో స్కూలుకు వెళుతున్న శృంగార తార
ఇటీవలి కాలంలో కాసింత సినిమా చాన్స్‌లు తగ్గాయేమో, చిరకాలంగా మిగిలిపోయిన తన కోరికను తీర్చుకునేందుకు బయలుదేరింది శృంగార తార సన్నీ లియాన్. రచయితగా, ఎడిటర్‌గా తనలో ప్రతిభను మెరుగుపరచుకోవాలని భావిస్తున్న ఆమె లాస్ ఏంజిల్స్‌లోని ఓ విద్యా సంస్థలో చేరింది. స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ కోర్సుల్లో చేరింది. తన భర్తతో కలిసి కొంత కాలం అక్కడే ఉండి కోర్సును పూర్తి చేయాలని ఆమె భావిస్తోంది. కొంత కాలంగా సన్నీ డైరీ ఖాళీగా ఉండడంతోనే చిక్కిన సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవలని సన్నీ ప్రయత్నాలు ప్రారంభించిందన్న మాట. అన్నట్టు లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరే ముందు దుబాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆడి పాడిందీ అమ్మడు.













