నేను వారికోసం ఏమైనా చేస్తా
5 ఏళ్లుగా బాలీవుడ్‌ను ఉర్రూత లూగించిన మాజీ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ ఇప్పుడు 35 ఏళ్ల వయసులో కూడా హాట్‌గా ఊరిస్తూ ఇండ్రస్టీలో ఒక రేంజ్లో దూసుకుపోవటానికి తన అభిమానగణమే కారణమంటోంది. వారు తనని ఆదరిస్తున్నంత కాలం తనకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని, వారికోసం ఏమైనా చేస్తానని చెబుతోంది. మొన్ననే రయీన్ సినిమాలో ఖాన్ సరసన ఒక ఐటెం సాంగ్ కూడ చేసిన భామ నేటివిటీకి దూరంగా ఉండటం వల్లనే తను ఇండస్ట్రీలో ఇలా నెట్టుకొస్తున్నానంటోంది. నిజానికి ట్విట్లర్లో నాకుచాలా మంది అభిమానులు ఉన్నారు. వారు ఎప్పుడూ నన్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకే నేను అనవసరమైన అసహ్యపు క్రిటిసిజం పట్టించు కోకుండా చక్కగా పనిలో దూసుకుపోతున్నాను. ఇక వేధించేవారికోసం బ్లాక్ బటన్ ఉంది కదా వెంటనే దాన్ని బ్లాక్ చేసిపాడేస్తే చాలు అంటూ ఓ నవ్వు నవ్వేసింది సన్నీ.













