సుధాకర్ కోమాకుల హీరోగా “నువ్వు తోపురా” ఫస్ట్ లుక్ విడుదల !!
“లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్స్ గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. సుధాకర్ కోమాకుల ఓ వైవిధ్యమైన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి “నువ్వు తోపురా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు (జూన్ 2) విడుదల చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. “సుధాకర్ కోమాకుల-నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న “నువ్వు తోపురా” చిత్రీకరణ 70% అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాం చేస్తున్నాం. 30% ఇండియాలో షూట్ చేస్తాం. మొదటి షెడ్యూల్ మే 23న మొదలయింది. తర్వాతి షెడ్యుల్ అమెరికాలో ప్రారంభంకానుంది. హాలీవుడ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న “నువ్వు తోపురా” టీజర్ ను జూన్ 9న విడుదల చేయనున్నాం. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు. కృష్ణవంశీ-వైవిఎస్ చౌదరిల వద్ద శిష్యరికం చేసిన ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తాడన్న నమ్మకం ఉంది” అన్నారు.
టెక్నీషియన్స్ డీటెయిల్స్, సమర్పణ: బేబీ జాహ్నవి
బ్యానర్: యునైటెడ్ ఫిలిమ్స్, నిర్మాత: డి.శ్రీకాంత్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరినాధ్ బాబు.బి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ తోట తరణి (నేషనల్ అవార్డ్ విన్నర్)
సౌండ్ డిజైనర్: శ్రీ పి.ఎ. దీపక్ (గ్రామీ అవార్డ్ విన్నర్)
సినిమాటోగ్రఫీ: ప్రకాష్ వేలాయుధం, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, స్టంట్స్: విజయ్
కథ-మాటలు: అజ్జు మహంకాళి, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి-శ్రేష్ట-కాసర్ల శ్యామ్
కొరియోగ్రఫీ: విశ్వ రఘు-విజయ్ ప్రకాష్, స్టైలింగ్: అశ్విన్ మావలే
స్టిల్స్: పార్థసారధి, పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్-భాను
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, సహా నిర్మాత: రితేష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దంతులూరి రవివర్మ
అమెరికా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జేమ్స్ కొమ్ము













