నేను మహాభారతం తీయడం లేదు
మహాభారతం సినిమాను తాను తీయడం లేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపాడు. మహాభారతం సినిమాను రాజమౌళి తీస్తాడని గతంలో ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తాను బాహుబలి-2 విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. మహాభారతం సినిమా తన కలని చెప్పానే కానీ, తాను తీస్తున్నానని చెప్పలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే తాను ఏ సినిమా మొదలు పెట్టలేదని ఆయన సృష్టం చేశారు. కొంత కాలం తరువాత తన తరువాత ప్రాజెక్టు ప్రారంభిస్తానని ఆయన అన్నారు.













