కార్తీక్‌గా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి… ‘ENE Repeat’తో జోరు మీదున్న యంగ్ హీరో
‘ఈ నగరానికి ఏమైంది 2’లో కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటిని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. మొదట్లో విమర్శలు కూడా వచ్చాయి. సుశాంత్ రెడ్డిని మ్యాచ్ చేస్తాడా?లేదా? అని అందరిలోనూ అనుమానాలుండేవి ‘ఈ నగరానికి ఏమైంది’ ఫ్యాన్స్ అసలే కార్తిక్ పాత్రలో సుశాంత్‌కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. అలా అందరినీ సంతృప్తి పర్చాల్సి ఉంటుంది. ఎక్కడ తేడా కొట్టిన శ్రీనాథ్ మాగంటి ఇమేజ్‌కి కూడా డ్యామేజ్ అవుతుంది. సుశాంత్ తన వ్యక్తిగత కారణాలు, కుటుంబ వ్యాపారాలపై దృష్టి పెట్టడం, సినిమా నుంచి తప్పుకోవడంతో కార్తీక్ పాత్రకు శ్రీనాథ్ మాగంటి ఎంట్రీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
తరుణ్ భాస్కర్ లాంటి ప్యాషనేట్ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు శ్రీనాథ్ కూడా అంతే ఉత్సుకతో ఎదురు చూశాడు. ఫస్ట్ డే షూటింగ్ రోజు ఒక వేళ శ్రీనాథ్ మాగంటి కార్తీక్ పాత్రలో ఇమడకపోపయినా, సంతృప్తి కలగకపోయినా ఇంకో ఆప్షన్‌కి వెళ్దామన్న కోణంలో మేకర్స్ ఉన్నారు. కానీ ఆ విషయం శ్రీనాథ్‌కి తెలియదు. కానీ శ్రీనాథ్ మాత్రం కార్తీక్ పాత్రకు ప్రాణం పోశాడు. సుశాంత్‌ని మ్యాచ్ చేస్తూ కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయాడు. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయాడు.
శ్రీనాథ్, శివాత్మిక ట్రాక్ కూడా పండింది. సినిమా విడుదలకు ముందున్న సందేశాల్ని శ్రీనాథ్ పటాపంచలు చేసేశాడు. ట్రోలింగ్ చేసిన వారంతా ఇప్పుడు కార్తీక్ పాత్రకు శ్రీనాథ్ న్యాయం చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నా నటనతో సంతృప్తి చెందకపోతే కార్తీక్ పాత్ర కోసం మరొక నటుడిని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావించారు. కానీ ఈ రోజు, సినిమా విడుదలైంది. నేను దానిలో భాగమయ్యాను. అదే నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు’ అని శ్రీనాథ్ ఎమోషనల్ అవుతున్నాడు. ‘హిట్’, ‘యానిమల్’ వంటి చిత్రాలలో సైడ్ ఆర్టిస్ట్‌గా మంచి సక్సెస్ అందుకున్న శ్రీనాథ్‌కి ఇప్పుడు ఈ కార్తీక్ పాత్ర, సినిమా విజయంతో మరింత బాధ్యత పెరిగిపోయింది. ఇకపై శ్రీనాథ్ లీడ్ రోల్స్‌తో అందరినీ అలరించేందుకు సిద్దంగా ఉన్నాడు.







