సినిమాలో నటించడం కంటే పెళ్లి చేసుకుంటనే ఆనందం!
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, కరణ్ జోహర్ తెరకెక్కించే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2లో ఆమె టైగర్ ష్రఫ్ సరసన చిత్రసీమకు పరిచయం కానుందని తెలుస్తోంది. కానీ తల్లి శ్రీదేవి మాత్రం తన కూతురు సినిమాల్లో నటించడం కంటే పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడితే చూడాలని అనుకుంటోంది. జాన్వీ పెళ్లి చేసుకుంటే చూడటం నాకెంతో ఆనందంగా ఉంటుంది. తను సినిమాలు చేయాలనుకుంటోంది. మొదట్లో నేను అందుకు ఇష్టపడలేదు. సినిమా పరిశ్రమ చెడ్దదని నేను అనుకోను. నేను ఆ పరిశ్రమ నుంచి వచ్చినదాన్నే. కానీ, ఓ తల్లిగా తను పెళ్లి చేసుకుంటే చూడటం నాకెంతో ఆనందంగా ఉంటుంది. కానీ తన ఆనందమే ఎక్కువ నాకు. తను నటిగా రాణిస్తే, ఓ తల్లిగా నా కన్న గర్వపడే వారు ఉండరు అని శ్రీదేవి పేర్కొంది.








