ఘనంగా బాలు జన్మదిన వేడుకలు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన 72వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామంలో జరుపుకున్నారు. తమిళనాడు లోని పళ్లిపట్టు సమీపంలోని కోనేటంపేట గ్రామంలో జన్మించిన ఎస్పీ బాల సుబ్రమణ్యం తన బాల్యాన్ని గ్రామంలోనే గడిపారు. గాయకుడిగా పరిచయమై ప్రపంచ ప్రఖ్యాత గాయకుడి స్థాయికి ఎదిగారు. గ్రామస్తుల కోరిక మేరకు తన 72వ జన్మదినోత్సవాన్ని సొంత గ్రామంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోనేంపేట యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో బాలును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ తనను గాయకుడిగా కాకుండా కోనేటంపేట మణిగా చూస్తే సంతోషిస్తానని, అప్పుడే తరచూ పుట్టిన గ్రామానికి వస్తానన్నారు. తనకు సంగీతమే భాష అని పుట్టిన గ్రామానికి వచ్చిన గ్రామస్తులతో ముచ్చటించాలని తనకు ఉన్నప్పటికీ గాయకుడిగా అందరికీ పరిచయం కావడం వల్ల ఎలాంటి శుభకార్యాలకు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. సభలో మద్రాసు వర్సిటీ తెలుగుశాఖాధ్యులు సంపత్‌కుమార్, ద్రవిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు పాల్గొన్నారు.













