సింధూరపువ్వు ..మళ్లీ వస్తోంది
సింధూరపువ్వ చిత్రంతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిరోష, ఆ తరువాత గ్లామర్ హీరోయిన్గా మారి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నిరోషా పెళ్లిచేసుకుని సినిమాలకు దూరమైంది. స్టువర్ట్పురం పోలీస్‌స్టేషన్, నారి నారి నడమ మురారి, ఘర్షణ వంటి చిత్రాల్లో నటించిన ఈమె, చివరిగా తరుణ్ హీరోగా వచ్చిన ఒక ఊరిలో చిత్రంలో కనిపించింది. ఆ తరువాత పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించిన నిరోషా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. లైప్ ఈజ్ బ్యూటిపుల్ ఫేం సుధాకర్ కొమాకుల హీరోగా రూపొందుతున్న నువ్వు తోపురా చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. నిత్యాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నిరోషా కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం. మరి ఈ సినిమా తరువాత ఈమె ఏ తరహా పాత్రల్లో ఆకట్టుకుంటుందో చూడాలి.








