సైమా అవార్డు అందుకున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ గత ఏడాది నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజీ చిత్రాల ద్వారా మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లోని ఆయన నటనకు అటు ప్రేక్షకులే కాదు ఇటు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురింపించారు. దీంతోపాటు 2016కు గానూ తారక్ పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఇటీవల అబుదాబిలో అంగరంగ వైభవంగా సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జనతాగ్యారేజ్ చిత్రంలో నటనకు ఎన్టీఆర్కు ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించారు. అయితే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ వేదికపై అవార్డు అందుకోలేకపోయారు. తాజాగా సైమా చైర్పర్సన్ బృందా ప్రసాద్ ఇవాళ ఎన్టీఆర్కు స్వయంగా అవార్డును అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలనూ సైమా తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.













