ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలంటారు పెద్దలు. ఈ మాటని సినిమాలకు అనుగుణంగా మార్చుకొంది శ్రతిహాసన్. ఏ వయసులో చేయాల్సిన పాత్ర ఆ వయసులోనే చేయాలంటోది. మరీ ముఖ్యంగా కథానాయికలకు ఈ సూత్రం బాగా వర్తిస్తుందంటోంది శ్రుతి. ఈ మధ్యే కాటమరాయుడు లో పవన్ కల్యాణ్ పక్కన మెరిసింది. మా నాన్నగారు చిన్న వయసులోనే ముసలి వాడిగా నటించారు. మరుగుజ్జ పాత్ర కూడా పోషించారు. కథానాయకులకు ఉండే సౌలభ్యం అదే. ఎన్ని రకాలుగానైనా మారొచ్చు. అయితే కథానాయికలకు అన్ని ప్రత్యామ్నాయాలు ఉండవు. మేం కాస్త వయసైపోయిన వాళ్లలా కనిపిస్తే ఎవ్వరూ చూడరు. వయసుకి తగ్గ పాత్రల్లోనే కనిపించాలి. నిజంగా నడివయస్కురాలి పాత్ర వస్తే, అది ఆ వయసులోనే చేయాలి. అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించాలని అందరికీ ఉంటుంది. అయితే అన్నీ ఇప్పుడే చేసేస్తే ఎలా? మున్నందు కొత్త పాత్రలు కవరైపోతాయి అంటూ చెబుతోంది శ్రుతి.













