జార్జ్ క్రిష్ కోసం కొత్త లుక్ లో శర్వా
శర్వానంద్(Sharwanand) హీరోగా శ్రీను వైట్ల(Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందుతున్న జార్జ్ క్రిష్(George Krish) సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. కొంతకాలంగా తన లుక్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న శర్వానంద్.. ఈ సినిమా కోసం మరింత స్టైలిష్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు లుక్ ఒక్కటే ప్రత్యేకత కాదని, కథలోని టైమ్-ట్రావెల్ కాన్సెప్ట్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుందని టాక్. గతం, వర్తమానం మధ్య కథనం సాగనుండటంతో ఎంటర్టైన్మెంట్కు కొత్త ట్రీట్మెంట్ జోడించే అవకాశం ఉంది.
శ్రీను వైట్ల సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కీలకంగా ఉంటాయి. జార్జ్ క్రిష్ లోనూ ఆయనకు బాగా కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్‌ను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో మిళితం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇది కేవలం టైమ్ మార్చుకునే కథ కాకుండా, ఆ మార్పు వల్ల హీరో లైఫ్ లో ఎదురయ్యే పరిస్థితుల చుట్టూ వినోదాన్ని పండించే ప్రయత్నంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. శర్వానంద్‌కు ఈ కొత్త తరహా క్యారెక్టర్, లుక్ ఎంతవరకు కొత్త ఇమేజ్ను తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైన ఈ సినిమాకు వరుస షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. నవంబర్ చివరి నాటికి మెయిన్ షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది. అనిల్ సుంకర(Anil sunkara) నిర్మిస్తున్న ఈ సినిమాలో మానస వారణాసి(manasa varanasi) హీరోయిన్ గా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్(Anup rubens) సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి బరిలో జనవరి 14న సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. దీంతో వచ్చే సంక్రాంతికి శర్వానంద్ ఎంటర్టైన్మెంట్తో ఎలాంటి టైమ్‌లైన్ చూపిస్తాడన్నది ఆసక్తిని పెంచుతోంది.








