మరోసారి సితారతో ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. ఇప్పటికే సార్(Sir), కుబేర(Kuberaa) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. మరోసారి టాలీవుడ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు మార్కెట్లో తనకు వచ్చిన రెస్పాన్స్ ను కంటిన్యూ చేసేలా కొత్త కథను ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
ఈ క్రమంలో సార్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments)తో ధనుష్ మరోసారి కలిసి పనిచేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. లబ్బర్ పందు(labbar pandhu) తో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న తమిళరసన్ పచ్చముత్తు(Thamilarasan Pachamuthu) ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ రూరల్ ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ సినిమా కథలో గ్రామీణ నేపథ్యంతో పాటు కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఉండనున్నట్లు సమాచారం.
మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే.. ఈ సినిమాకు ధనుష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించే అవకాశముంది. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావడం ప్రాజెక్ట్‌పై ఆయనకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందనే మాటలు వినపిస్తున్నాయి. నెక్ట్స్ ఇయర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ధనుష్ ఓం(OM) మూవీ వర్క్స్ ను పూర్తి చేసి, దీపావళి రిలీజ్ కు రెడీ అవుతున్నారు.








