ది ప్యారడైజ్ రీషూట్స్ పై డైరెక్టర్ క్లారిటీ
నేచురల్ స్టార్ నాని(nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Sirkanth odela) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(the paradise) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల తన మార్క్‌కు తగ్గట్టుగా మరింత భారీ యాక్షన్ ప్రపంచాన్ని సృష్టించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే సినిమా కేవలం యాక్షన్ సీన్స్ సమాహారంగా ఉండదని డైరెక్టర్ తాజా కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి. కథలోని ఎమోషన్ యాక్షన్‌కు సమానంగా ప్రాధాన్యం పొందనుంది.
సినిమా విషయంలో రీషూట్లు, కథలో భారీ మార్పులు జరిగాయనే ప్రచారానికి కూడా డైరెక్టర్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ విషయంలో ముందుగానే ఫుల్ క్లారిటీతో సెట్స్‌కు వెళ్లే తన విధానాన్ని ఆయన వెల్లడించారు. కొన్ని సీన్స్ లో నటీనటుల నుంచి వచ్చిన నేచురల్ ఇంప్రొవైజేషన్స్ మాత్రమే చోటుచేసుకున్నాయని తెలిపారు. దీంతో ది ప్యారడైజ్ కథను మొదటి నుంచి అనుకున్న దిశలోనే తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.
మరోవైపు మోహన్‌బాబు(mohan babu) పోషిస్తున్న సికంజీ మాలిక్ క్యారెక్టర్, నాని క్యారెక్టర్ కు మధ్య వచ్చే సీన్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలవనున్నాయని శ్రీకాంత్ చెప్పారు. ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే టెన్షన్ ఆడియన్స్ లో అడ్రినలిన్ పెంచేలా ఉంటుందని డైరెక్టర్ చెబుతున్నారు. నాని క్యారెక్టర్ కు డైరెక్టర్ చిన్ననాటి జ్ఞాపకాల్లోని ఓ అంశాన్ని జోడించడం కూడా ఆసక్తికరంగా మారింది. అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) మ్యూజిక్ ది ప్యారడైజ్ వరల్డ్ కు మరింత ఎనర్జీని జోడించనుండగా, సెప్టెంబర్ 24న ఈ వైల్డ్ రైడ్ థియేటర్లలోకి రానుంది.








