రణ్వీర్-దీపిక ఇంట మరో పాప
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్(Ranveer singh), దీపికా పదుకొణె(Deepika padukone) ఫ్యామిలీలో మరోసారి పండుగ వాతావరణం నెలకొంది. ఈ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. సెప్టెంబర్ 19న తమకు మరో పాప జన్మించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బేబీ ఫీట్‌ను చూపిస్తూ షేర్ చేసిన పోస్టులో రణ్వీర్, దీపికతో పాటు పెద్ద కుమార్తె దువా పేర్లు ఉండటం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
రెండో బిడ్డ రాకకు ముందు నుంచే ఈ కుటుంబంలో ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. ముఖ్యంగా ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని రణ్వీర్, దీపిక సందర్శించడం ఇప్పుడు మరోసారి డిస్కషన్ కు వచ్చింది. దువా(Dua) పుట్టడానికి ముందు కూడా ఇదే ఆలయాన్ని సందర్శించిన ఈ జంటకు, అదే తరహాలో రెండోసారి తల్లిదండ్రులయ్యే సమయంలోనూ ఈ ఆలయ సందర్శన జరగడం విశేషంగా మారింది.
2024లో వివాహ జీవితానికి మరో కొత్త అధ్యాయంగా దువా రాగా, ఇప్పుడు రెండో కూతురి రాకతో వారి కుటుంబం మరింత పెద్దదైంది. ఈ నెలలో నిర్వహించిన మ్యాటర్నిటీ షూట్, దువా సెకండ్ బర్త్ డే సందర్భంగా షేర్ చేసుకున్న ఫ్యామిలీ ఫొటోలు కూడా ఈ కొత్త ప్రయాణానికి ముందుమాటగా నిలిచాయి. 2018లో పెళ్లి చేసుకున్న రణ్వీర్, దీపిక బాజీరావ్ మస్తానీ(baajirao mastani), పద్మావత్(padmavat) వంటి సినిమాల్లో కలిసి నటించారు.








