శరభ ఫస్ట్‌లుక్ విడుదల
అకాశ్ కుమార్, మిష్టి జంటగా నటిస్తున్న చిత్రం శరభ. ది గోల్డ్ అనేది ఉపశీర్షిక. ఎన్.నరసింహరావు దర్శకుడు. ఏకేఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతకాంపై అశ్విని కుమార్ సహదేవ్ నిర్మించారు. కోటి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు నటి జయప్రద పాల్గొన్నారు. చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. ఈ ప్రచార చిత్రంలో హీరో ఓ పంజరంలో గుడ్లగూభను పట్టుకుని కనిపించారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.













