అమెరికన్ దర్శకుడితో షారుఖ్ లూంగీ డ్యాన్స్
చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో షారుఖ్‌ఖాన్ లుంగీ డ్యాన్స్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ లుంగీ స్టెప్పుల్ని ప్రముఖ అమెరికన్ దర్శకుడు బ్రెట్ రాట్నెర్కు నేర్పించాడు షారుఖ్. ఇటీవల జరిగిన శాన్ప్రాన్సిస్కో అంతర్జాతీయ చిత్రోత్సవంలో షారుఖ్ పాల్గొన్నాడు. రష్ అవర్ సిరీస్ చిత్రాలతో పాటు ఎక్స్‌మెన్, ది లాస్ట్ స్టాండ్ చిత్ర దర్శకుడు, ఆస్కార్ గెలిచిన ది రెవనెంట్ చిత్ర నిర్మాత బ్రెట్ రాట్నెర్తో కలిసి వేదికను పంచుకున్నాడు షారుఖ్. రాట్నెర్కు లుంగీ స్టెప్పులు ఎలా వేయాలో చేసి చూపించాడు షారుఖ్. రాట్నెర్ స్పందిస్తూ ఏదో ఒక రోజు షారుఖ్‌తో రష్ అవర్ సీక్వెల్‌ను ఇండియాలో తెరకెక్కిస్తానని చెప్పారు. దీంతో పాటు షారుఖ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ షారుఖ్ మంచి డ్యాన్సర్. ఆయనతో కలిసి స్టెప్పులేయడం గొప్పగా ఉంది అని చెప్పారు రాట్నెర్. షారుఖ్ గౌరవార్థం ప్రముఖ హాలీవడున చిత్రాలతో పాటు మై నేమ్ ఈజ్ ఖాన్ ను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించారు.













