చరణ్ కి జోడిగా బాలీవుడ్ హీరో కూతురు?
రాంచరణ్, మణిరత్నం కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు ఎప్పటినుంచో గుసగుసలు వెలువడుతున్నాయి. సినిమాలో చరణ్‌కి జోడీగా ఐశ్యర్య రాయ్ నటించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ని ఎంపికచేసుకోనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగేతే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రాంచరణ్, సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకులముందుకు రానుంది.








