బాలీవుడ్ లోకి సానియా మీర్జా!
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో వెండితెర మీద మెరవనుంది. కోర్ట్ లోనే కాదు ఫోటో షూట్ లోనూ ఆకట్టుకునే ఈ బ్యూటీ, ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనలతో ఆకట్టుకుంటోంది. అదే బాటలో వెండితెర మీద కూడా సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తుందట. ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా, సానియా తెరంగేట్రంపై బాలీవుడ్ ఫిలిం మేకర్ ఫర్ఫాన్ అక్తర్ హింట్ ఇచ్చాడు. ఈ 30 ఏళ్ల హైదరాబాదీ భామ, తన తండ్రితో కలిసి ఓ బాలీవుడ్ సినిమాలో నటించనుందని తెలిపారు. సానియా మీర్జా, ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జాల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఫర్ఫాన్ ఈ ప్రకటన చేశారు. ఫర్ఫాన్ ట్వీట్ పై స్పందించిన సానియా మీర్జా, కృతజ్ఞతలు తెలియజేసింది.













