వినాయక నవరాత్రుల సందర్భంగా ‘సమయం’ చిత్ర టీజర్ విడుదల
మాగంటి శ్రీనాథ్, పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం సమయం. ఆర్ జే వై శ్రీరాజ దర్శకత్వం వహిస్తున్నారు. గద్ద రమేష్ నిర్మాత. ఎడ్ల జయపాల్ రెడ్డి సహ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. వినాయక నవరాత్రుల పర్వదినం సందర్భంగా సమయం చిత్ర టీజర్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు.
అంబటి శ్రీను, ప్రియాంకా నాయుడు, సుమన్ శెట్టి, రవికుమార్, వెంకీ, కర్ణ, శ్యామ్, మేఘన, మళ్లి రమేష్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ శ్యామ్ ధూపటి, సంగీతం ఘన శ్యామ్, ఎడిటింగ్ వేణు కొడగంటి, ఆర్ట్ శ్రీనివాస చారి, కొరియోగ్రఫీ ఛార్లి, మోహన్ కిషోర్, ఫైట్స్ నందు, ప్రొడక్షన్ కంట్రోలర్ బెక్కం రవీందర్, కో డైరక్టర్ సాయి త్రివేది, కథ, కథనం, మాటలు, దర్శకత్వం ఆర్ జే వై శ్రీరాజ.













