నా హీరో చాలా గ్రేట్ : సమంత
కథానాయిక సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తన సినిమా విశేషాలతోపాటూ కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యపై ఉన్న ప్రేమను అనేక సందర్భాల్లో తెలిపారు. తాజాగా అమె చైతునూ ఉద్దేశించి ట్వీట్ చేశారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం యుద్ధం శరణం. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దీన్ని చైతూ ట్విటర్ వేదికగా పంచుకుంటూ శత్రువులు ద్రోహం చేసినా, ఆశలు ఆవిరైనా, నా గూడు చెదిరినా నేను ధైర్యంగా జీవించగలను అని ట్వీట్ చేశారు. దీన్ని సమంత రీట్వీట్ చేస్తూ నా హీరో చాలా గ్రేట్ అని చెప్పారు.








