మిథాలీ రాజ్ గా సమంత?
సమంత అక్కినేని వారింటి కోడలుగా త్వరలో మారబోతోంది. ఆ తర్వాత పరిస్థితేంటని ఆమెను ఇటీవల అడిగితే మార్పేమీ ఉండదని, సినిమాలు ఎప్పటిలాగే కంటిన్యూ చేస్తానని చెప్పిన వషయం విదితమే. అయితే పెళ్లి తర్వాత ఆమె ఏ మూవీలో నటించబోతోందనే ప్రస్తుతం హాట్ టాపిక్. ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమైన బయోపిక్‌ల ట్రెండ్, ఇప్పుడిప్పుడే దక్షిణాదికి కూడా పాకుతోంది. తాజాగా మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్. బయోపిక్ త్వరలో తెరకెక్కనుందనే వార్త కూడా తెలిసింది. ఈ బయోపిక్‌లో మిథాలీగా సమంత నటించనుందనే వార్త టాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. గతంలో మేరికోమ్ బయోపిక్‌ను ప్రియాంక చోప్రాతో తీసిన వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతోంది. వివిధ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా దక్షిణాదిలో నటించేందుకు సమంతను ఎంచుకుందని తెలుస్తోంది.








