అక్టోబరులో సామ్- చైతుల పెళ్లి
నాగచైతన్య -సమంత త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. అక్టోబరులోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆ విషయాన్ని నాగచైతన్య ప్రకటించారు. అయితే పెళ్లి ఎక్కడనే విషయాన్ని మాత్రం అక్కినేని కుటుంబం రహస్యంగా ఉంచుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పెళ్లి వేడుక డెస్టినేషన్ మ్యారేజ్గా గోవాలో జరగబోతోందని సమాచారం. పరిమిత సంఖ్యలో బంధు మిత్రుల మధ్య ఈ వేడుకని జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకొన్నట్లు తెలిసింది. అయితే పెళ్లి ఎక్కడ జరిగినా హైదరాబాద్లో మాత్రం విందు కార్యక్రమాన్ని నిర్వహించాలని నాగార్జున నిర్ణయించినట్లు తెలిసింది. పెళ్లికి మరో ఐదు నెలలు సమయం మాత్రమే ఉండటంతో ఆలోపుగా సమంత, నాగచైతన్యలు చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారట. పెళ్లి తర్వాత ఇద్దరూ నెల రోజులకిపైగా సెలవు తీసుకొంటారని తెలిసింది. హనీమూన్ కోసం న్యూయార్క్ వెళ్లబోతున్నారు.













