చైతూకీ నాకు ఎప్పుడో పెళ్లయిపోయింది
సామాజిక అనుసంధాన వేదికల ద్వారా తన అభిమానుల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంది సమంత. ట్విట్టర్లో సమంత ఎప్పుడు హలో చెప్పినా, అభిమానుల నుంచి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు వెల్లువలా వస్తుంటాయి. వాటికి సమంత కూడా ఓపిగ్గానే సమాధానం చెబుతుంటుంది. నాగచైతన్యతో సమంత వివాహం ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రశ్నల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. చైతూని పెళ్లి చేసుకోబోతున్నారు కదా? ఆ ఫీలింగ్ ఎలా ఉంది అని ఓ అభిమాని ప్రశ్నిస్తే చైతూకీ నాకు ఎప్పుడో పెళ్లయిపోయింది. మా ఊహల్లో, మా పెళ్లి గురించి మాకు తప్ప మిగిలిన వాళ్లకే ఉత్సాహం ఎక్కువగా ఉన్నట్టుంది అని సమాధానం చెప్పింది సమంత.













