పెళ్లి తర్వాత హనీమూన్ ఉండదు
అక్కినేని నాగచైతన్య, సౌత్బ్యూటీ సమంత త్వరలో పెళ్లిపీటలు ఎక్కేయనున్నసంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. అక్టోబర్ 6న గోవాలో వీరిద్దరి పెళ్లి వేడుకలు జరగనున్నాయి. అయితే వీరు పెళ్లి తర్వాత ఓ లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారని వీళ్ల హనీమూన్ టూర్లో భాగంగా రెండు నెలలకు పైగా సమయాన్ని అమెరికాలో గడపనున్నారని, షూటింగ్లకు డుమ్మాకొట్టేస్తారని టాక్ విన్పించింది. ఇపుడు వీటన్నింటినీ సమంత సింగిల్ స్టేట్మెంట్తో ఖండించింది. అక్టోబర్ 6న గోవాలో మేమిద్దరం పెళ్లి చేసుకోనున్నామని, ఇది మాత్రం నిజం. హంగూ ఆర్భాటాలతో భారీగా ఖర్చుచేసి పెళ్లిచేసుకోవాలని మేం అనుకోవటం లేదన్నారు. ఒక సాధారణ పెళ్లిమాదిరిగానే, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, చుట్టాల మధ్య పెళ్లి జరుగుతుందన్నారు. అలాగే తము హనీమూన్ కోసం షూటింగ్లు మానేసి 3 నెలలు చక్కర్లు కొడతామనే మాటలో కూడా వాస్తవం లేదని చెప్పింది. తమ పెళ్లి జరిగిన మూడోరోజునే ఇద్దరం ఎవరి సినిమా షూగింగ్లో వారు పాల్గొంటామని చెప్పి షాకిచ్చింది. దీంతో వీరిద్దరు ఎంతటి ప్రొఫెషనల్స్ అనే సంగతి అర్థం చేసుకోవచ్చు కదా.













